Uttarakhand: ఉత్త‌రాఖండ్‌లో లోయలో ప‌డ్డ పెళ్లి బృందం వాహ‌నం.. 10 మంది మృతి

accident in uttarakhand
షార్ట్స్‌లో చూడండి
ఓ వాహనం లోయలో పడిపోవ‌డంతో 10 మంది ప్రాణాలు కోల్పోయిన ఘ‌ట‌న ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చంపావత్ జిల్లాలో చోటు చేసుకుంది. ఆ జిల్లాలోని సుఖిదాంగ్-దాందమినార్ రహదారి మీదుగా మహీంద్ర మ్యాక్స్ వాహనంలో ఓ వివాహానికి వెళ్లి, తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై స‌మాచారం అందుకున్న పోలీసులు స‌హాయక చ‌ర్య‌ల్లో పాల్గొని ప‌లు వివ‌రాలు తెలిపారు.  

పంచముఖి ధర్మశాలకు చెందిన లక్ష్మణ్ సింగ్ కుమారుడు మనోజ్ సింగ్ పెళ్లి వేడుక సంద‌ర్భంగా వారంతా గ‌త‌ అర్ధరాత్రి తర్వాత మహీంద్ర మ్యాక్స్ వాహనంలో సొంత ప్రాంతానికి వెళ్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగింద‌ని వివ‌రించారు. ఈ రోజు తెల్ల‌వారుజామున‌ 3.20 గంటల సమయంలో వాహనం అదుపు తప్పి, రహదారి పక్కన ఉన్న లోయలోకి దూసుకెళ్లింద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌లో మ‌రికొంద‌రికి గాయాలు కావ‌డంతో వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించామ‌ని చెప్పారు.
Go Back to Shorts
Uttarakhand
Road Accident

More Telugu News