Surya: 'ఈటి' నుంచి తెలుగు లిరికల్ సాంగ్ రిలీజ్!

ET movie lyrical song released
షార్ట్స్‌లో చూడండి
సూర్య కథానాయకుడిగా తమిళంలో 'ఇతరుక్కుమ్ తునింధవన్' అనే సినిమా రూపొందింది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 10వ తేదీన విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు మలయాళ .. కన్నడ భాషల్లోనూ ఈ సినిమాను విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను 'ఈటి' అనే టైటిల్ తో వదులుతున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి తెలుగు లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "సిలుకు జుబ్బా స్మార్టు .. పెట్టేశావే స్పాటు .. పొడవకురో గుండెల్లోనా పోటు" అంటూ ఈ పాట సాగుతోంది. ఇమాన్ స్వరపరిచిన ఈ పాటకి వనమాలి సాహిత్యాన్ని అందించగా, హరిచరణ్ - శ్రీనిధి ఆలపించారు.

సూర్య - ప్రియాంక మోహన్ పై చిత్రీకరించిన ఈ పాటకి జానీ మాస్టర్ కొరియోగ్రఫీని అందించాడు. ఇది మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఫాస్టు బీట్. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాలో, సత్యరాజ్ .. శరణ్య .. రాజ్ కిరణ్ .. సూరి ముఖ్యమైన పాత్రలను పోషించారు. చాలా గ్యాప్ తరువాత థియేటర్స్ కి వస్తున్న సూర్య సినిమా ఇది.
Go Back to Shorts
Surya
Priyanka Mohan
ET Movie
Sathyaraj

More Telugu News