రఘురామకృష్ణ రాజుపై నమోదైన ఎస్సీ, ఎస్టీ కేసులో స్టే విధించిన హైకోర్టు
- చింతలపూడి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు
- సీఐడీ డీజీ సునీల్ బంధువు కేసు పెట్టారన్న రఘురాజు లాయర్
- సాక్ష్యాధారాలు లేకుండానే కేసు పెట్టారని కోర్టుకు తెలిపిన వైనం
రఘురాజు ఎలాంటి దూషణలు చేయకపోయినా కేసు నమోదు చేశారని ఆయన లాయర్ వెంకటేశ్ వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాలు లేకుండానే కేసు నమోదు చేశారని చెప్పారు. వాదనలను విన్న హైకోర్టు తదనంతర చర్యలపై స్టే విధించింది. అంతేకాదు, ఫిర్యాదుదారుడికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టును ఆదేశించింది.