Liger: చిత్రీకరణ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ 'లైగర్'

  • పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్
  • విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా చిత్రం
  • ఆగస్టు 25న రిలీజ్
Vijay Devarakonda Liger shoot wrapped up

పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్'. తాజాగా ఈ యాక్షన్ ఎంటర్టయినర్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే కథానాయికగా నటించింది. చిత్రీకరణ కూడా పూర్తవడంతో 'లైగర్' కు సంబంధించి ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలున్నాయి. ఆగస్టు 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో మహాబలుడు, బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ కీలకపాత్ర పోషిస్తుండడం విశేషం. పూరీ కనెక్ట్స్, ధర్మా మూవీస్ బ్యానర్లపై మిక్సడ్ మార్షల్ ఆర్ట్స్ కాన్సెప్టుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది.

  • Loading...

More Telugu News