ఎన్టీఆర్ తో బుచ్చిబాబు మూవీ టైటిల్ ఇదేనంటూ రూమర్!

Buchhibabu Movie Update
  • కొరటాలతో ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ 
  • లైన్లోనే ఉన్న బుచ్చిబాబు
  • చురుకుగా జరుగుతున్న పనులు 
ఎన్టీఆర్ తో బుచ్చిబాబు ఒక సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా గురించిన ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. ఈ కథ గ్రామీణ నేపథ్యంలో నడుస్తుందట. కబడ్డీ ఆటగాడిగా ఈ సినిమాలో ఎన్టీఆర్ కనిపించనున్నాడు.

ఎన్టీఆర్ పాత్ర పేరు 'పెద్ది' .. అదే పేరును సినిమాకి టైటిల్ గా సెట్ చేసే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. కబడ్డీ ఆటగాడిగా ఒక ఆశయం దిశగా హీరో ముందుకు వెళతాడు. ఆ ఆశయం చుట్టూ ఆవేశం .. బలమైన ఎమోషన్స్ ఉంటాయని అంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ పేరు వినిపిస్తోంది.

ఇక ఈ సినిమాకి ముందు ఎన్టీఆర్ .. కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. ఈ సినిమా పొలిటికల్ టచ్ తో కొనసాగుతుంది. స్టూడెంట్ లీడర్ గా ఎన్టీఆర్ కనిపిస్తాడని చెబుతున్నారు. కథానాయికలుగా రష్మిక .. కీర్తి సురేశ్ పేర్లు వినిపిస్తున్నాయి.
Go Back to Shorts
Junior NTR
Koratala Siva
Bhuchi Babu Movie

More Telugu News