విజయవాడ నుంచి బెంగళూరు వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన ఏపీఎస్ఆర్టీసీ!
- టికెట్ ధరపై 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించిన అధికారులు
- వెన్నెల, అమరావతి బస్సు సర్వీసులకు రాయితీ వర్తింపు
- ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరిన అధికారులు
అయితే శుక్రవారం బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చే సర్వీసులు, ఆదివారం విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే సర్వీసుల్లో మాత్రం సాధారణ ఛార్జీలను వసూలు చేస్తారు. రాయితీ కారణంగా విజయవాడ నుంచి బెంగళూరుకు వెళ్లే వెన్నెల స్లీపర్ టికెట్ ధర రూ. 1,490కి, అమరావతి సర్వీస్ టికెట్ ఛార్జీ రూ. 1,365కి తగ్గింది. ఈ సదుపాయాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు.