Nagarjuna: అసలైన 'బంగార్రాజు' మా నాన్నే: నాగ్

  • రాజమండ్రిలో జరిగిన 'బంగార్రాజు' ఈవెంట్
  • స్టేజ్ పై హుషారుగా మాట్లాడిన నాగార్జున
  • మీ అభిమానం ముందు వసూళ్లు ఎంత?
  • ఇండస్ట్రీకి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండు కళ్లు
  • వాళ్లని ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలన్న నాగ్
Bangarraju Block Buster Meet

'బంగార్రాజు' సినిమాతో నాగార్జున మరోసారి భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సంక్రాంతికి హిట్ ఖాయమంటూ చెప్పి రంగంలోకి దిగిన నాగార్జున, ముందుగా చెప్పినట్టుగానే బ్లాక్ బస్టర్ ను అందుకున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి రాజమండ్రిలో జరిగిన 'బ్లాక్ బస్టర్ మీట్'లో ఆయన మాట్లాడారు.

"నిజానికి 'బంగార్రాజు' మేము కాదు .. అసలైన 'బంగార్రాజు' అక్కినేని నాగేశ్వరరావు గారు. ఆయన ఆశీస్సుల కారణంగానే ఈ సినిమా ఇంతటి ఘన విజయాన్ని సాధించింది. ఇక్కడే ఎక్కడో ఆయన నిలబడి ఉంటారు .. ఈ సంబరాన్ని చూస్తుంటారు. మీ అందరి ఆదరాభిమానాలను మాకు ఇచ్చింది ఆయనే.

రాజమండ్రిలో ఈ సినిమా హౌస్ ఫుల్స్ తో నడుస్తోందని విన్నాను. అయినా ఇక్కడికి నేను కలెక్షన్ల గురించి మాట్లాడటానికి రాలేదు. మీ ప్రేమ గురించి మాట్లాడటానికి వచ్చాను. మీరు చూపించే ప్రేమాభిమానాల ముందు కలెక్షన్లు ఎంత? తెలుగు సినిమాకి ఎన్టీఆర్ - ఏఎన్నార్ రెండు కళ్ల వంటివారు. తెలుగు సినిమా ఉన్నంతవరకూ వాళ్లిద్దరినీ గుర్తుపెట్టుకుంటాం .. గుర్తుపెట్టుకోవాలి" అని చెప్పుకొచ్చారు.

More Telugu News