Nagarjuna: రాజమండ్రిలో 'బంగార్రాజు' బ్లాక్ బస్టర్ మీట్!

  • ఈ నెల 14వ తేదీన వచ్చిన 'బంగార్రాజు'
  • మూడు రోజుల్లో 50 కోట్ల క్లబ్ లోకి
  • అన్ని ప్రాంతాల్లోను అదే జోరు  
  • ఈ సాయంత్రం 'బ్లాక్ బస్టర్ మీట్'
Bangarraju Block Buster Meet

నాగార్జున - నాగచైతన్య ప్రధానమైన పాత్రలను పోషించిన 'బంగార్రాజు' సంక్రాంతి కానుకగా, ఈ నెల 14వ తేదీన థియేటర్లకు వచ్చింది. రమ్యకృష్ణ - కృతి శెట్టి కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, విడుదలైన మూడో రోజునే ఈ సినిమా 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం విశేషం.

పక్కా పండుగ సినిమా .. పక్కా హిట్ అని చెబుతూనే రంగంలోకి దిగిన నాగార్జున, చెప్పినట్టుగానే భారీ హిట్ కొట్టాడు. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది. దాంతో ఈ సినిమా టీమ్ 'బంగార్రాజు బ్లాక్ బస్టర్ మీట్' ను రాజమండ్రిలో ఏర్పాటు చేసింది. రాజమండ్రిలోని 'మార్గాని ఎస్టేట్ గ్రౌండ్' లో ఈ సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటలవరకూ ఈ కార్యక్రమం జరగనుంది.

'బంగార్రాజు' అనే టైటిల్ .. అందుకు తగినట్టుగా నాగార్జున లుక్ .. గ్రామీణ నేపథ్యం .. ఇలా ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయి. రొమాంటిక్ యాంగిల్లో చైతూ కనిపించడం .. కృతి శెట్టికి యూత్ లో ఉన్న క్రేజ్ ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచాయి. పండగకి సంబంధించిన కంటెంట్ తో పాటు, అనూప్ అందించిన పాటలు కూడా ఈ సినిమా విజయానికి కారణమయ్యాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

More Telugu News