Anand Devarakonda: కొత్త దర్శకుడితో ఆనంద్ దేవరకొండ!

Anand Devarakonda in Sai Rajesh Movie
షార్ట్స్‌లో చూడండి
ఆనంద్ దేవరకొండ హీరోగా ఒక్కో సినిమాను చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన తొలిసినిమా 'దొరసాని' సినిమా మంచి కంటెంట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గడీల పెత్తనం .. పేదవాడి ప్రేమతో ముడిపడిన ఈ కథ యూత్ కు కొంతవరకు బాగానే కనెక్ట్ అయింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం వర్కౌట్ కాలేదు. కథలో పాత్రకి తగినట్టుగానే చేశాడనే పేరు కొట్టేశాడు.

ఆ తరువాత చేసిన 'మిడిల్ క్లాస్ మెలోడీస్' మాత్రం, సినిమాకి సరిపడే కంటెంట్ కాదనే విమర్శలను మూటగట్టుకుంది. ఇక 'పుష్పక విమానం' సినిమాకి ప్రమోషన్స్ బాగానే చేశారు. కానీ ఎందుకనో రిలీజ్ కి ముందుగానీ .. ఆ తరువాత గాని ఎవరూ కూడా ఆ సినిమాను గురించి మాట్లాడుకోలేదు. ఈ నేపథ్యంలో ఆయన నుంచి రావడానికి 'హైవే' సినిమా రెడీ అవుతోంది.

కేవీ గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ద్వారా, కథానాయికగా మానస రాధాకృష్ణన్ పరిచయమవుతోంది. ఇక ఆ తరువాత ఆయన ఒక కొత్త దర్శకుడితో సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. 'కలర్ ఫొటో' సినిమాకి రచయితగా పనిచేసిన సాయిరాజేశ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. ఎస్ కేఎన్ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నారు. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందనుందని అంటున్నారు.
Go Back to Shorts
Anand Devarakonda

More Telugu News