ఎన్టీఆర్ సరసన సందడి చేయనున్న రష్మిక?

Rashmika in koratala movie
  • 'పుష్ప'తో దక్కిన భారీ సక్సెస్
  • విజయ్ జోడీగా అవకాశం
  • హిందీ నుంచి భారీ ఆఫర్లు
  • ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్టులో చోటు?
రష్మిక సక్సెస్ గ్రాఫ్ ఇప్పుడు ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. రీసెంట్ గా తెలుగులో 'పుష్ప' సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తమిళ .. మలయాళ .. హిందీ భాషల్లోను వసూళ్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించింది. ఆయా భాషల్లో రష్మిక కెరియర్ కి ఈ సినిమా చాలా హెల్ప్ అయిందనే విషయం అర్థమవుతోంది.

తమిళ .. హిందీ సినిమాల నుంచి ఆమెకి అవకాశాలు పెరిగినట్టుగా చెబుతున్నారు. విజయ్ తదుపరి సినిమాలో ఆమెనే హీరోయిన్ అంటున్నారు. ఇక తెలుగులో ఆమె 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాయిక ప్రధానమైన సినిమా కూడా ఒకటి చేయనుంది. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ సినిమాకి గాను ఆమె పేరు తెరపైకి వచ్చింది.

కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కథానాయికలుగా కియారా అద్వాని .. జాన్వీ కపూర్ .. అలియా భట్ పేర్లు వినిపించాయి. తాజాగా తెరపైకి రష్మిక పేరు వచ్చింది. టాలీవుడ్ లో వరుస హిట్లతో ఉన్న ఈ భామ, ఎన్టీఆర్ జోడీ కట్టనుందనే విషయంలో వాస్తవమెంతన్నది చూడాలి మరి.
Go Back to Shorts
Rashmika Mandanna
Junior NTR
Koratala Siva

More Telugu News