రఘురామకృష్ణ‌రాజుకు నాలుగు నోటీసులు ఇచ్చిన ఏపీ సీఐడీ పోలీసులు

ap cid gives notice to raghu rama
  • హైద‌రాబాద్‌, గచ్చిబౌలిలోని ర‌ఘురామ ఇంటికి సీఐడీ
  • ఇంట్లో నోటీసులు ఇచ్చిన అధికారులు
  • ఈ నెల 13, 14, 16, 17 తేదీల్లో విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశం
హైద‌రాబాద్‌, గచ్చిబౌలిలోని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ‌రాజు ఇంటికి వెళ్లిన‌ ఏపీ సీఐడీ పోలీసులు స‌దరు ఎంపీకి నేరుగా నోటీసులు ఇస్తామ‌ని చెప్పిన విష‌యం తెలిసిందే. చివ‌ర‌కు ఆయ‌న ఇంట్లో లేక‌పోవ‌డంతో ఆయ‌న కుమారుడికి నాలుగు నోటీసులు ఇచ్చారు.

ఈ నెల 13, 14, 16, 17 తేదీల్లో విచార‌ణ‌కు రావాల‌ని ర‌ఘురామకృష్ణ‌రాజును ఆదేశించారు. ఏపీ సీఎం జ‌గ‌న్‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేసిన కేసులో మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టేందుకు వారు ఈ నోటీసులు ఇచ్చారు. అనంత‌రం ఆయ‌న ఇంటి నుంచి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లిపోయారు.
Go Back to Shorts
Andhra Pradesh
cid
Raghu Rama Krishna Raju

More Telugu News