మహీంద్రా కార్లు తప్ప వేరే కార్లు డ్రైవ్ చేయరా? అనే ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా ఆసక్తికర సమాధానం
- మహీంద్రా కాకుండా వేరే కార్లు ఉన్నాయని చెపుతున్నారా? అన్న ఆనంద్ మహీంద్రా
- నాకు ఐడియా లేదే అంటూ చమత్కారం
- ఏదో సరదాకి అంటున్నానని వ్యాఖ్య
'సార్, మహీంద్రా కార్లు తప్ప ఇతర కార్లను మీరు డ్రైవ్ చేయరా?' అని నెటిజెన్ ప్రశ్నించగా... ' అంటే... మహీంద్రా కాకుండా వేరే కార్లు కూడా ఉన్నాయని చెపుతున్నారా? నాకు ఐడియా లేదే' అని సమాధానమిచ్చారు. అలాగే, ఊరికే ఏదో సరదాగా అంటున్నానంటూ స్మైలీ ఎమోజీని పెట్టారు. ఆయన చమత్కారానికి నెటిజెన్లు ఫిదా అవుతున్నారు