అవును.. అతనితో ప్రేమలో ఉన్నా: రకుల్ ప్రీత్ సింగ్
- బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమలో ఉన్నాను
- చాలా కాలంగా ఇద్దరం డేటింగ్ లో ఉన్నాము
- మా రిలేషన్ షిప్ గురించి ఇంట్లో వాళ్లకు, స్నేహితులకు తెలుసు
తామిద్దరిదీ ఒకే రంగమని, తమ ఆహారపుటలవాట్లు కూడా ఒకేలా ఉంటాయని రకుల్ తెలిపింది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని స్వీకరించడానికే తాము ప్రాధాన్యతను ఇస్తామని చెప్పింది. తామిద్దరికీ కుటుంబాలు చాలా ముఖ్యమని తెలిపింది. అయితే ఇప్పట్లో తాము పెళ్లి చేసుకునే అవకాశం లేదని చెప్పింది. తన చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయని... వాటిని పూర్తి చేసిన తర్వాతే పెళ్లి అని తెలిపింది. తన ప్రేమ గురించి అందరికీ తానే చెప్పానని, పెళ్లి గురించి కూడా అందరికీ తానే చెపుతానని, మీకు తెలియకుండా పెళ్లి చేసుకోనని చెప్పింది.