Crime News: శామీర్‌పేటలో క‌ల‌క‌లం.. అమ్మాయి చేతులు క‌ట్టేసి, మృత‌దేహాన్ని చెరువులో ప‌డేసిన దుండ‌గులు

  • పొన్నాల చెరువులో మృత‌దేహం ల‌భ్యం
  • అమ్మాయిపై లైంగికదాడి చేసిన దుండ‌గులు?
  • పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లింపు
murder in shamirpet

తెలంగాణ‌లోని మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట మండలంలో దారుణ ఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చింది. అక్క‌డి పొన్నాల చెరువులో చేతులు కట్టేసి ఉన్న‌ ఓ యువతి మృతదేహం క‌న‌ప‌డ‌డం క‌ల‌క‌లం రేపింది. ఆ అమ్మాయిపై లైంగికదాడి చేసిన దుండ‌గులు అనంత‌రం చంపేసి చెరువులో పడేసినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు యువతి మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఆ అమ్మాయి చేతులు కట్టేసి ఉండ‌డం అనేక‌ అనుమానాలకు తావిస్తోంది. దుండ‌గులు లైంగిక దాడి చేసి యువతిని హత్య చేసి ఉండొచ్చ‌ని పోలీసులు కూడా భావిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

More Telugu News