Junior NTR: కొరటాలను తొందర పెట్టేస్తున్న ఎన్టీఆర్!

Ntr and Koratala Movie Updates
షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా తన సినిమాల మధ్య గ్యాప్ లేకుండా చూసుకుంటూ వచ్చాడు. హిట్ అయినా .. ఫ్లాప్ అయినా ఆడియన్స్ తో గ్యాప్ రాకుండా వరుస సినిమాలు చేస్తూ వచ్చాడు. అలాంటి ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కోసం మూడేళ్లకి పైగా కేటాయించవలసి వచ్చింది. తీరా ఈ సినిమా ఈ సంక్రాంతికి విడుదల అవుతుందనుకుంటే వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో ఇక తదుపరి సినిమాలను చకచకా పూర్తి చేయాలనే నిర్ణయానికి ఎన్టీఆర్ వచ్చేసినట్టుగా చెబుతున్నారు. ఆయన నెక్స్ట్ మూవీ కొరటాల శివతో ఉండనుంది. జనవరి 7న 'ఆర్ ఆర్ ఆర్' .. ఫిబ్రవరి 4వ తేదీన 'ఆచార్య' విడుదల కాగానే ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళదామని అనుకున్నారు.

కానీ సాధ్యమైనంత త్వరలో రెగ్యులర్ షూటింగు మొదలుపెట్టేలా ప్లాన్ చేయమని కొరటాలకి ఎన్టీఆర్ చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇదే ఏడాదిలో బుచ్చిబాబుతో కూడా మరో సినిమా చేసి, ఏడాది చివరిలో ప్రశాంత్ నీల్ ప్రాజెక్టును మొదలుపెట్టాలని ఆలోచనలో ఆయన ఉన్నాడని అంటున్నారు. ఇంతకుముందు ఈ ఇద్దరి కాంబినేషన్లో 'జనతా గ్యారేజ్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Junior NTR
Koratala Shiva
Tollywood

More Telugu News