తెలంగాణ రోజువారీ కరోనా కేసుల వివరాలు ఇవిగో!

Telangana corona statistics and details
  • రాష్ట్రవ్యాప్తంగా 21,679 కరోనా పరీక్షలు
  • 274 మందికి పాజిటివ్
  • జీహెచ్ఎంసీ పరిధిలో 212 కొత్త కేసులు
  • రాష్ట్రంలో ఒకరి మృతి
  • ఇంకా 3,779 మందికి చికిత్స
తెలంగాణలో గడచిన ఒక్కరోజులో 21,679 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 274 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. జీహెచ్ఎంసీలో భారీస్థాయిలో 212 కొత్త కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 18, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 17 కేసులు వెల్లడయ్యాయి. పలు జిల్లాల్లో కొత్తకేసులేవీ నమోదు కాలేదు.

అదే సమయంలో 227 మంది కరోనా నుంచి కోలుకోగా, ఒకరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 6,82,489 పాజిటివ్ కేసులు నమోదు కాగా ... 6,74,680 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 3,779 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా మృతుల సంఖ్య 4,030కి పెరిగింది.
Go Back to Shorts
Telangana
Corona Virus
Statistics
Daily Report
Today Cases

More Telugu News