Prithvi Shaw: బాలీవుడ్ భామ ప్రేమలో క్రికెటర్ పృథ్వీ షా

Prithvi Shah and Prachi Shah in love
  • హీరోయిన్ ప్రాచీ సింగ్ ప్రేమలో పృథ్వీ షా
  • పృథ్వీని హత్తుకున్న ఫొటోను పోస్ట్ చేసిన ప్రాచీ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో
క్రికెటర్లకు, బాలీవుడ్ తారలకు మధ్య ప్రేమాయణాలు సాధారణ విషయమే. తాజాగా యువ క్రికెటర్ పృథ్వీషా కూడా బాలీవుడ్ భామ ప్రేమలో పడిపోయాడు. బాలీవుడ్ నటి ప్రాచీ సింగ్ ప్రేమలో మునిగితేలుతున్నాడు. వీరిద్దరూ క్లోజ్ గా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పృథ్వీని హత్తుకున్న ఫొటోలను ప్రాచీ సింగ్ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. చాలా కాలంగా సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరి పోస్టులకు మరొకరు స్పందిస్తూ వస్తున్నారు. మరోవైపు వీరి జంట చూడముచ్చటగా ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
Prithvi Shaw
Team India
Prachi Singh
Bollywood

More Telugu News