Road Accident: సంగారెడ్డి జిల్లాలో నెత్తురోడిన రహదారి... నలుగురి దుర్మరణం

Four died in a road accident in Sangareddy district
షార్ట్స్‌లో చూడండి
కొత్త సంవత్సరం రోజున రహదారి రక్తదాహం నలుగురిని బలిదీసుకుంది. తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్ మండలం డిడ్గి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. బాలరాజు, శ్రావణి అనే దంపతులు, వారి ఎనిమిది నెలల చిన్నారి అమ్ములుతో కలిసి బైకుపై వెళుతుండగా, ఓ కారు బలంగా ఢీకొట్టింది. ఆపై కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో బైకుపై ఉన్న దంపతులు, చిన్నారి సహా, కారులోని ఓ వ్యక్తి కూడా మరణించాడు. కాగా, మృతి చెందిన దంపతులు అనంతపురం జిల్లా గుత్తి మండలం బాచుపల్లికి చెందినవారిగా వెల్లడైంది.
Go Back to Shorts
Road Accident
Sangareddy District
Bike
Car

More Telugu News