Vijay Devarakonda: 'లైగర్'గా విరుచుకుపడిన విజయ్ దేవరకొండ.. ఫస్ట్ గ్లింప్స్ విడుదల

 Liger Movie Glimpse Released
షార్ట్స్‌లో చూడండి
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా 'లైగర్' సినిమా రూపొందుతోంది. పూరి .. చార్మీ .. కరణ్ జొహార్ కలిసి పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాక్సింగ్ నేపథ్యంలో నడిచే కథ ఇది. ఈ సినిమాతో బాలీవుడ్ భామ అనన్య పాండే  తెలుగు తెరకి కథానాయికగా పరిచయమవుతోంది.

న్యూ ఇయర్ గిఫ్టుగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ఫస్టు గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ముంబైలోని ఒక మురికివాడకు చెందిన యువకుడు, చాయ్ వాలాగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఒక బాక్సర్ గా ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఆయనకి ఎదురైన సవాళ్లు ఎలాంటివి? అనేదే ఈ సినిమా కథ అనే విషయం అర్థమవుతోంది.

ఫస్టు గ్లింప్స్ నే పూరి ఒక రేంజ్ లో అందించాడు. పూరి మార్క్ మాస్ సినిమాకి, విజయ్ దేవరకొండ మార్క్ యాక్షన్ తోడైతే ఎలా ఉంటుందనేది ఈ గ్లింప్స్ చెప్పేసింది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ .. హిందీ భాషలలో ఈ సినిమాను ఆగస్టు 25వ తేదీన విడుదల చేయనున్నారు.
Go Back to Shorts
Vijay Devarakonda
Ananya Panday
Ramyakrishna
Liger Movie

More Telugu News