తెరుచుకున్న అయ్యప్ప ఆలయం.. తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనం
- గురువారం సాయంత్రం తెరుచుకున్న ఆలయం
- జనవరి 19న తిరిగి మూసివేత
- 14న మకర జ్యోతి దర్శనం
- నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్
రెండేళ్ల తర్వాత తొలిసారి పెద్దపాదం మార్గాన్ని భక్తుల కోసం తెరిచారు. రేపటి నుంచి ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. ఎరుమేలి నుంచి ఉదయం ఐదున్నర గంటల నుంచి రాత్రి పదిన్నర మధ్య ఈ మార్గంలో భక్తులను అనుమతిస్తారు. నీలక్కల్, ఎరుమేలి వద్ద దర్శనం కోసం స్పాట్ బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. భక్తులు తప్పనిసరిగా రెండు డోసులు వేసుకున్నట్టుగా టీకా ధ్రువీకరణ పత్రాన్ని కానీ, కరోనా నెగటివ్‌గా ధ్రువీకరించే ఆర్టీపీసీఆర్ టెస్టు రిపోర్టును కానీ తీసుకెళ్లాల్సి ఉంటుంది. జనవరి 14న మకర జ్యోతి దర్శనం ఉంటుంది. 19న ఆలయాన్ని మూసివేస్తారు.