Allu Arjun: 'దాక్కో దాక్కో మేక' ఫుల్ సాంగ్ చూసేయండి!

  • హిట్ టాక్ తెచ్చుకున్న 'పుష్ప'
  • బాక్సాఫీస్ నుంచి భారీ లాభాలు 
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ 
  • సాహిత్యం చంద్రబోస్  
Dakko Dakko Meka full song released

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప' సినిమా ఈ నెల 17వ తేదీన థియేటర్స్ కి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమా, బాక్సాఫీస్ నుంచి భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాను మరోస్థాయికి తీసుకుని వెళ్లింది.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషలలో ఈ సినిమాను విడుదల చేశారు. తాజాగా ఆ వెర్షన్స్ నుంచి 'దాక్కో దాక్కో మేక' పూర్తి పాటను రిలీజ్ చేశారు. బలమున్నవాడిదే రాజ్యమనేదే అడవికి తెలిసిన న్యాయమనే అర్థంలో ఈ పాట సాగుతుంది. చంద్రబోస్ సాహిత్యం ఈ పాటకి ప్రధానమైన బలంగా నిలిచింది.
 
ఇక అడవి నేపథ్యంలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ మనుషుల వేషధారణ .. వాళ్ల బాడీ లాంగ్వేజ్ కి తగిన విధంగా కంపోజ్ చేసిన కొరియోగ్రఫీ ఈ పాటకు మరిన్ని మార్కులు తెచ్చిపెట్టాయి. ఈ సినిమా నుంచి ముందుగావచ్చిన ఈ పాట, అంచనాలు పెంచడంలో ప్రధానమైన పాత్రను పోషించిందనడంలో ఎలాంటి సందేహం లేదు.

More Telugu News