సైలెంట్ గా ఉండే రాధాపై ఎవరు రెక్కీ చేశారో అందరికీ తెలుసు: బుద్ధా వెంకన్న
- తన హత్యకు రెక్కీ జరిగిందంటూ వెల్లడించిన రాధా
- రాధా ఎవరి జోలికీ వెళ్లడన్న బుద్ధా వెంకన్న
- ఇందులో వైసీపీ పెద్దల ప్రమేయం ఉందని ఆరోపణ
- టీడీపీ ఆఫీసుపై దాడికి, రాధాపై రెక్కీకి లింకు ఉందని వ్యాఖ్య
గతంలో టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడికి, రాధాపై రెక్కీకి లింకు ఉందని పేర్కొన్నారు. సైలెంట్ గా ఉండే రాధాపై ఎవరు రెక్కీ నిర్వహించారో అందరికీ తెలుసని బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. దీంట్లో విజయవాడ నేతలతో పాటు వైసీపీ పెద్దల ప్రమేయం కూడా ఉందని ఆరోపించారు. వైసీపీ పాలనలో అడ్డగోలు దాడులకు తెగబడుతున్నారని మండిపడ్డారు.