Tollywood: సింహాల్లా పోట్లాడుకున్న తారక్–చెర్రీ.. 'ఆర్ఆర్ఆర్' ఇంటర్వెల్ బ్యాంగ్ లో ఇద్దరి మధ్య ఫైట్ అందుకేనట!

RRR Interval Bang NTR and Charan Fought Like Lions
షార్ట్స్‌లో చూడండి
‘ఆర్ఆర్ఆర్’.. మరో 10 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులంతా ఆ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాహుబలిని మించి ఉంటుందన్న అంచనాల మధ్య సినిమా విడుదలవుతుండడం, ఎన్టీఆర్–చరణ్ కలిసి నటిస్తుండడంతో ఆ అంచనాలు రెట్టింపయ్యాయి. ఈ నెల ప్రారంభంలో విడుదల చేసిన ట్రైలర్ ఓ రేంజ్ లో ఉండడం.. ఒక్కొక్కటిగా విడుదలవుతున్న పాటల్లో తీవ్రత ఓ లెవెల్ లో ఉండడంతో మామూలుగానే సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్నంటాయి.

ఇటీవల సినిమా ప్రమోషన్లలో ‘ఆర్ఆర్ఆర్’ టీం బిజీ బిజీ అయిపోయింది. మొన్న చెన్నైలో నిర్వహించిన ఈవెంట్ లో మాట్లాడిన రాజమౌళి.. హీరోల ఇంట్రడక్షన్ సీన్లు, ఇంటర్వెల్ ఫైట్ అదిరిపోతాయని అన్నారు. ఆ సీన్ అభిమానుల ఊహకు కూడా అందదని అన్నారు. అయితే, ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కు సంబంధించి ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

16 నిమిషాల పాటు ఆ ఫైట్ సాగుతుందని అంటున్నారు. బ్రిటిష్ అధికారుల కింద ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా పనిచేసే రామ్ చరణ్.. బ్రిటిష్ అధికారులకు వ్యతిరేకంగా పోరాడే ఎన్టీఆర్ ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తాడట. ఆ సందర్భంగా ఇద్దరి మధ్య సాగే ఫైట్ హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. తారక్, చెర్రీలు సింహాల్లా పోట్లాడుకున్నారట. ఒకరికి మించి మరొకరు నువ్వా–నేనా అన్నట్టు ఆ సీన్ లో లీనమైపోయారట. మరి ఆ సీన్ ను తనివితీరా చూడాలంటే మాత్రం జనవరి 7 దాకా వెయిట్ చేయాల్సిందే.
Go Back to Shorts
Tollywood
Bollywood
Junior NTR
Ramcharan
Rajamouli
RRR

More Telugu News