దసరా బరిలోకి దిగనున్న 'పుష్ప 2'

Pushpa 2 movie update
  • వసూళ్ల పరంగా 'పుష్ప' దూకుడు
  • ఫిబ్రవరి నుంచి 'పుష్ప 2' షూటింగ్
  • ఆ సీన్స్ పైనే సుకుమార్ దృష్టి
  • 100 రోజుల్లో షూటింగు పూర్తి
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'పుష్ప' సినిమా రికార్డుస్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. అల్లు అర్జున్ - రష్మిక నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి రెండవ భాగం ఉన్న సంగతి తెలిసిందే. రెండవ భాగానికి సంబంధించిన షూటింగును ఫిబ్రవరిలో మొదలుపెట్టడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.

రెండవ భాగంలో మదర్ సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుందట. అయితే ఇప్పుడు దాని నిడివిని తగ్గించి, ఫాజిల్ కీ బన్నీకి మధ్య సీన్స్ ను పెంచే ఆలోచనలో సుకుమార్ ఉన్నాడట. అలాగే రష్మిక - బన్నీ మధ్య రొమాన్స్ పాళ్లు పెంచే ఆలోచన కూడా చేస్తున్నాడట. 100 రోజుల్లో ఈ సినిమా షూటింగు పార్టును పూర్తి చేయాలనే దిశగా ప్లాన్ చేస్తున్నాడని అంటున్నారు.

'పుష్ప ది రైజ్' పేరుతో ఫస్టు పార్టు రాగా, సెకండ్ పార్టును 'పుష్ప ది రూల్' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారని అంటున్నారు. మలయాళంలో ఫహాద్ ఫాజిల్ చాలా బిజీ ఆర్టిస్ట్. అయన డేట్స్ ఎప్పుడు ఉన్నాయో చూసుకుని, దానిని బట్టి మిగతా వాళ్ల డేట్స్ ను సెట్ చేస్తారట. చూస్తుంటే ఈ సినిమాను 'దసరా' బరిలో దింపే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa 2 Movie

More Telugu News