మెగా మూవీలో కీర్తి సురేశ్ జోడీగా చైతూ?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మెగా మూవీలో కీర్తి సురేశ్ జోడీగా చైతూ?

Nagachaitanya in Bholashankar movie
  • రిలీజ్ కి రెడీగా 'థ్యాంక్యూ'
  • షూటింగు పూర్తిచేసుకున్న 'బంగార్రాజు'
  • లైన్లో రెండు ప్రాజెక్టులు
  • 'భోళా శంకర్'లో చేసే ఛాన్స్
ప్రస్తుతం చిరంజీవి మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టారు. 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేర్ వీర్రాజు' పట్టాలెక్కాయి. ఈ సినిమాల్లో 'భోళా శంకర్'కి మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది తమిళంలో హిట్ కొట్టిన 'వేదాళం' సినిమాకి రీమేక్. చెల్లెలి సెంటిమెంట్ ప్రధానంగా ఈ కథ నడుస్తుంది. ఆ చెల్లెలి పాత్ర కోసం కీర్తి సురేశ్ ను తీసుకున్నారు.

ఇక కీర్తి సురేశ్ జోడీగా నాగశౌర్య అయితే బాగుంటాడని భావించి ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారట. ఇంతకుముందు 'మహానటి' సినిమాలో ఏఎన్నార్ పాత్రలో కీర్తి సురేశ్ కాంబినేషన్లో చైతూ ఒక సీన్ లో చేశాడు. ఆయన అయితే తాము అనుకున్న పాత్రకి పెర్ఫెక్ట్ గా సరిపోతాడని భావిస్తున్నారట. అయితే ప్రస్తుతం చైతూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు.

త్వరలో విక్రమ్ కుమార్ మూవీ 'థ్యాంక్యూ'ను థియేటర్లకు తీసుకు రానున్న ఆయన, రీసెంట్ గా 'బంగార్రాజు' షూటింగును కూడా పూర్తి చేశాడు. ఇక మరో రెండు ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందువలన ఆయన ఒప్పుకుంటాడో లేదో చూడాలి. మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధం కారణంగా ఒప్పుకునే అవకాశాలు లేకపోలేదని కూడా అంటున్నారు.
Chiranjeevi
Keerthi Suresh
Nagachaitanya
Bhola Shankar Movie

More Telugu News