బాలీవుడ్ లోను 'పుష్ప' తగ్గడం లేదుగా!

Pushpa movie update
  • ఈ నెల 17న వచ్చిన 'పుష్ప'
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు
  • హిందీలోనూ అదే దూకుడు
  • అభినందించిన అక్షయ్
తెలుగు రాష్ట్రాల్లో 'పుష్ప' సినిమా వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. ఈ సినిమా నుంచి ఒక్కో లుక్ వదులుతూ .. ఒక్కో లిరికల్ సాంగును రిలీజ్ చేస్తూ ఒక రేంజ్ లో పబ్లిసిటీ చేశారు. దాంతో ప్రతి ప్రాంతంలోను ఈ సినిమా తనదైన దూకుడు చూపుతోంది. తొలి ఆటతోనే వచ్చిన టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతోంది.

ఇక హిందీలోనూ ఈ సినిమా అదే రేంజ్ లో తన సత్తా చూపుతోంది. హిందీ డబ్బింగ్ సినిమాల ద్వారా అల్లు అర్జున్ అక్కడి ప్రేక్షకులకు బాగా పరిచయం. అందువలన తన సినిమాలకి అక్కడ భారీ ప్రమోషన్స్ అవసరం లేదని కూడా ఆయన చెప్పాడు. అన్నట్టుగానే పెద్దగా ప్రమోషన్స్ లేకపోయినా ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబడుతోంది.

తొలి నాలుగు రోజుల్లోనే ఈ సినిమా అక్కడ 16 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని అంటున్నారు. లాంగ్ రన్ లో 25 నుంచి 30 కోట్ల వరకూ గ్రాస్ ను రాబట్టవచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా 'పుష్ప'కు వస్తున్న రెస్పాన్స్ పట్ల అక్షయ్ కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ బన్నీకి అభినందనలు తెలియజేశాడు. త్వరలో తాను ఈ సినిమా చూడనున్నానంటూ ట్వీట్ చేయడం విశేషం.
Go Back to Shorts
Allu Arjun
Rashmika Mandanna
Sukumar
Pushpa Movie

More Telugu News