junior ntr: 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం ఎన్టీఆర్ పడ్డ కష్టాన్ని వివరించే వీడియో ఇదిగో!

ntr action scenes in rrr movie
షార్ట్స్‌లో చూడండి
భారీ అంచనాలతో జనవరి 7న 'ఆర్ఆర్ఆర్' సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా గురించి చేస్తున్న భారీ ప్రచారంతో అభిమానుల్లో ఆత్రుత, సినీ ప్రియుల్లో ఉత్సుకత పెరిగిపోతున్నాయి. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ తో ఈ సినిమాను రాజమౌళి పీక్ కు తీసుకెళ్లేట్టున్నారు. భారత్ లోనే అతిపెద్ద డ్రామ, యాక్షన్ చిత్రంగా చెబుతున్న ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ నటించిన అపురూప సన్నివేశాలతో కూడిన వీడియో క్లిప్పింగ్ ఇన్ స్టా గ్రామ్ లోకి వచ్చేసింది. ఇక్కడి వీడియో చూస్తే మీకే తెలుస్తుంది..ఇక్కడ క్లిక్ చేయండి

ఇందులో సన్నివేశాలు చూస్తే రోమాలు నిక్కబొడుచుకోవడం ఖాయం. యాక్షన్ సన్నివేశాల కోసం ఎన్టీఆర్ చేస్తున్న కసరత్తులు కనిపిస్తాయి. రాజమౌళి దగ్గరుండి మరీ అభినయం గురించి వర్ణిస్తుండడాన్ని చూడొచ్చు. పొట్టి నిక్కర్ పై అడవిలో వాయు వేగంతో పరిగెడుతూ ఎన్టీఆర్ ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతున్నారు.

తారక్ కొమురంభీమ్ పాత్రతో.. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అరుదైన వీరి కాంబినేషన్ తో రాజమౌళి పెద్ద హిట్ కొట్టే విధంగా కష్టపడుతున్నారని ఇప్పటి వరకు వరుసపెట్టి విడుదల చేస్తున్న వీడియో క్లిప్పింగ్ లు చూస్తే అర్థమవుతోంది. రాజమౌళి సినిమా అంటేనే యాక్షన్ ప్రాధాన్యంగా ఉంటుందని వేరే చెప్పక్కర్లేదు. పైగా స్టార్ నటులతో చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి.
Go Back to Shorts
junior ntr
tarak
rrr movie
Rajamouli

More Telugu News