Pushpa: 'పుష్ప' ఐదు షోలు వేసుకోవచ్చు... తెలంగాణ ప్రభుత్వం అనుమతి

  • అల్లు అర్జున్ హీరోగా పుష్ప
  • సుకుమార్ దర్శకత్వంలో చిత్రం
  • రేపు వరల్డ్ వైడ్ రిలీజ్
  • చిత్రబృందానికి, థియేటర్ల యాజమాన్యాలకు తీపికబురు
  • పుష్ప ఓపెనింగ్స్ పెరిగే అవకాశం
Telangana govt gives nod for Pushpa fifth show

అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పుష్ప చిత్రం రేపు (డిసెంబరు 17) ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో పుష్ప చిత్రబృందానికి, థియేటర్ల యాజమాన్యాలకు తీపికబురు అందింది. పుష్ప ఐదో షో వేసుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి నిచ్చింది. ప్రభుత్వ నిర్ణయంతో పుష్ప చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించడానికి మార్గం సుగమం అయింది. పుష్ప చిత్రాన్ని దాదాపు 3 వేల థియేటర్లలో రిలీజ్ చేస్తున్నట్టు సమాచారం.

More Telugu News