మాస్ సాంగ్ తో రచ్చ చేస్తున్న రవితేజ!
- 'ఖిలాడి'గా రవితేజ
- ముగింపు దశలో షూటింగ్
- సంగీత దర్శకుడిగా దేవిశ్రీ
- ఫిబ్రవరి 11వ తేదీన విడుదల
హైదరాబాద్ - అన్నపూర్ణ స్టూడియోలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ఈ రోజున ఒక పాట చిత్రీకరణను మొదలుపెట్టారు. రవితేజ .. మీనాక్షి చౌదరి .. డింపుల్ హయతిపై ఈ పాట చిత్రీకరణ జరుగుతోంది. ఈ పాటకి శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీని అందిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఒక మాస్ మసాలా సాంగ్ ఇది.
ఈ సినిమాలో ఒక పాటను రవితేజ స్వయంగా పాడినట్టుగా వార్తలు వచ్చాయి. మరి అది ఈ పాటనా? కాదా? అనే విషయం మాత్రం తెలియదు. అర్జున్ .. సచిన్ ఖేడ్కర్ .. ఉన్నిముకుందన్ కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, అనసూయ ప్రత్యేకమైన పాత్రలో కనిపించనుంది. ఫిబ్రవరి 11వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు.