ఎన్టీఆర్ పెట్టుకున్న ఆ చేతి గడియారం ధర రూ.4 కోట్లు!
- సోషల్ మీడియాలో హాట్ టాపిక్
- రిచర్డ్ మిల్లీ నుంచి ఎఫ్1 లిమిటెడ్ ఎడిషన్ వాచ్
- నిన్న ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ కు అదే వాచ్ తో వచ్చిన తారక్

అవును మరి, ఆయన వాచ్ కున్న స్పెషాలిటీ అలాంటిది. అమెరికాకు చెందిన రిచర్డ్ మిల్లీ (ఆర్ఎం) బ్రాండ్ అది. ఆ బ్రాండ్ లోని 011 కార్బన్ ఎన్టీపీటీ గ్రోషన్ మోడల్ వాచ్ ను ఎన్టీఆర్ తన చేతికి తొడిగారు. అందులోనూ రోజ్ గోల్డ్ లోటస్ ఎఫ్ 1 టీమ్ లిమిటెడ్ ఎడిషన్ వాచ్ అది. మరి ప్రైస్ మాత్రం మామూలుగా ఉంటుందా? ఆ వాచ్ ఖరీదు రూ.3,99,32,395. చెప్పాలంటే రౌండ్ ఫిగర్ రూ.4 కోట్లేసుకోండి. సెలబ్రిటీలన్నాక ఆ మాత్రం రేంజ్ ఉంటుందిలే అంటూ నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.