Nayanthara: కొత్త వ్యాపారాన్ని ప్రారంభించిన నయనతార

Nayanathara starts new business
షార్ట్స్‌లో చూడండి
సినిమా హీరోయిన్లు ఓ వైపు సినిమాలను చేస్తూనే... మరోవైపు వివిధ బిజినెస్ లను నిర్వహిస్తుండటం పరిపాటే. ఇప్పటికే చాలామంది నటీమణులు రకరకాల బిజినెస్ లలో పెట్టుబడులు పెట్టి, రాణిస్తున్నారు. వీరిలో నయనతార కూడా ఒకరు. తాజాగా ఆమె మరో బిజినెస్ లోకి అడుగుపెట్టింది. బ్యూటీ ప్రాడక్ట్స్ బిజినెస్ ను ప్రారంభించింది. 'ది లిప్ బామ్ కంపెనీ' పేరుతో రీటైల్ బ్రాండ్ ను లాంచ్ చేసింది. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్ తో కలిసి ఈ బిజినెస్ ను ఆమె ప్రారంభించింది.
 
ఈ  సందర్భంగా రేణిత మాట్లాడుతూ, నయన్ తో తనకు దశాబ్ద కాలంగా పరిచయం ఉందని చెప్పారు. ఆమెపై తనకు ఎంతో నమ్మకం ఉందని, అందుకే ఇద్దరం ఈ వ్యాపారంలో భాగస్వాములమయ్యామని తెలిపారు. ఈ కంపెనీకి సంబంధించి గత కొన్నేళ్లుగా తమ మధ్య చర్చలు జరిగాయని... అయితే కరోనా వల్ల కంపెనీని లాంచ్ చేయడం ఆలస్యమయిందని చెప్పారు.
Go Back to Shorts
Nayanthara
Tollywood
Kollywood
New Business

More Telugu News