దర్శకుడు వీవీ వినాయక్‌ను కలిసిన ఏపీ మంత్రి అవంతి
- విశాఖపట్నం భీమిలి బీచ్‌లో హిందీ ఛత్రపతి సినిమా షూటింగ్
- ఈ నెల 10 వరకు కొనసాగింపు
- వినాయక్ వద్దకు వెళ్లిన అవంతి
- వీవీ వినాయక్ తనకు మంచి మిత్రుడని వ్యాఖ్య
తాజాగా వినాయక్ ను మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిశారు. వీవీ వినాయక్ తనకు మంచి మిత్రుడని ఆయన చెప్పారు. వీవీ వినాయక్ స్వయం కృషితో దర్శకునిగా ఎదిగారని అన్నారు. హిందీలోనూ ఛత్రపతి సినిమా విజయం సాధిస్తుందని చెప్పారు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తోన్న వీవీ వినాయక్ అక్కడ రాణిస్తారని ఆయన అన్నారు.