Nagarjuna: సెకండ్ సింగిల్ వదులుతున్న 'బంగార్రాజు'

  • షూటింగు దశలో 'బంగార్రాజు'
  • ఆసక్తిని పెంచుతున్న అప్ డేట్స్
  • సంగీత దర్శకుడిగా అనూప్ రూబెన్స్  
  • డిసెంబర్ 1న సాంగ్ టీజర్ రిలీజ్
Bangarraju Movie Update

నాగార్జున - నాగచైతన్య ప్రధాన పాత్రధారులుగా 'బంగార్రాజు' సినిమా రూపొందుతోంది. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో, చైతూ జోడీగా కృతి శెట్టి సందడి చేయనుంది. ఈ సినిమా నుంచి వాళ్ల ఫస్టు లుక్స్ బయటికి వచ్చిన తరువాత అంచనాలు మరింతగా పెరుగుతూ వెళుతున్నాయి.

ఈ సినిమా సెట్స్ పైకి రావడానికి చాలా సమయం పట్టింది. కానీ సెట్స్ పైకి వెళ్లిన దగ్గర నుంచి మాత్రం ఎక్కడా ఆలస్యం కాకుండా చకచకా షూటింగును కానిచ్చేస్తున్నారు. అంతేకాదు .. పెద్దగా గ్యాప్ లేకుండా అప్ డేట్స్ వదులుతున్నారు. ఈ జోరు చూసే, ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలోకి దిగుతుందని చెప్పుకుంటున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా నుంచి, సెకండ్ సాంగ్ టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. డిసెంబర్ 1వ తేదీ ఉదయం 11:12 నిమిషాలకు, 'నా కోసం' అంటూ సాగే సాంగ్ టీజర్ ను రిలీజ్ చేయనున్నట్టు పోస్టర్ వదిలారు. చైతూ - కృతి శెట్టి కాంబినేషన్లోని ఈ పోస్టర్ కూడా ఎంతో ఆకట్టుకుంటోంది..

More Telugu News