మేజర్ షెడ్యూల్ పూర్తి చేసిన 'ఏజెంట్'
- అఖిల్ హీరోగా 'ఏజెంట్'
- స్పై థ్రిల్లర్ జోనర్లో నడిచే కథ
- కథానాయికగా సాక్షి వైద్య పరిచయం
- కీలకమైన పాత్రలో మమ్ముట్టి
ఈ సినిమా నుంచి వచ్చిన అఖిల్ లుక్ .. అందరిలో ఆసక్తిని రేకెత్తించింది. ఇది ఒక స్పై థ్రిల్లర్ .. కథ ప్రకారం విశాఖపట్నం .. కృష్ణపట్నం పోర్టులలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. గత కొన్ని రోజులుగా ఈ సినిమా యూరప్ లోని బడా ఫెస్ట్ లో మేజర్ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటూ వచ్చింది.
రీసెంట్ గా అక్కడ షూటింగును పూర్తిచేసిన ఈ సినిమా టీమ్ హైదరాబాద్ చేరుకుంది. తదుపరి షెడ్యూల్ ను హైదరాబాద్ లోనే ప్లాన్ చేశారట. దీంతో చాలావరకూ షూటింగు పార్టు పూర్తవుతుందని అంటున్నారు. కథానాయికగా సాక్షి వైద్య పరిచయమవుతుండగా, ఒక కీలకమైన పాత్రలో మమ్ముట్టి కనిపించనున్నారు.
.