పవన్ తో పోటీకి దిగుతున్న నితిన్!
- కొత్త దర్శకుడితో నితిన్
- సొంత బ్యానర్లో సినిమా
- రాజకీయల నేపథ్యంలో నడిచే కథ
- ఏప్రిల్ 29వ సినిమా రిలీజ్
ఈ సినిమా షూటింగు జోరుగా జరుగుతూ ఉండటం చూసి, వచ్చే ఏడాది ప్రథమార్థంలో రావొచ్చునని అనుకున్నారు. అలాగే వచ్చే ఏప్రిల్ 29వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నట్టుగా నిన్న ప్రకటించారు. అదే రోజున పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' రిలీజ్ ఉండటం విశేషం. ఇంతకుముందే క్రిష్ ఆ డేట్ ఫిక్స్ చేశాడు.
మొదటి నుంచి నితిన్ .. పవన్ కి వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఆయన సినిమాల్లో .. ఆయన సినిమా ఫంక్షన్లలో పవన్ ప్రస్తావన లేకుండా ఉండదు. మరి తన కంటెంట్ పై నమ్మకంతో నితిన్ ఆ డేట్ చెప్పాడా? లేదంటే ఆ రోజున పవన్ థియేటర్లకు వచ్చే అవకాశం లేదనే సంకేతాలు ఏమైనా అందాయా? అనేది తెలియాల్సి ఉంది.