Junior NTR: 'ఆర్ ఆర్ ఆర్' మూడో సాంగ్ కి ముహూర్తం కుదిరినట్టే!

RRR movie update
షార్ట్స్‌లో చూడండి
రాజమౌళి దర్శకత్వంలో 'ఆర్ ఆర్ ఆర్' సినిమా రూపొందింది. డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదల కానుంది. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి.

కీరవాణి ఈ సినిమాకి సంగీతాన్ని అందించారు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'నాటు .. నాటు' అనే పాటను వదిలారు. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించిన ఈ పాట, రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.  

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ను వదలడానికి సన్నాహాలు జరుగుతున్నాయని అంటున్నారు. ఈ నెల 18వ తేదీన మూడవ సాంగ్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారని చెప్పుకుంటున్నారు. విడుదల సమయం దగ్గర పడుతూ ఉండటంతో ఇక వరుసగా ఒక్కో ఆయుధాన్ని వదులుతున్నారన్న మాట.
Go Back to Shorts
Junior NTR
Ramcharan
Alia Bhatt

More Telugu News