Akhanda: భం అఖండ... భం భం అఖండ.. బాలకృష్ణ 'అఖండ' నుంచి టైటిల్ సాంగ్ విడుదల

Akhanda title song released
షార్ట్స్‌లో చూడండి
నందమూరి బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న 'అఖండ' చిత్రం నుంచి నేడు టైటిల్ సాంగ్ రిలీజైంది. 'భం అఖండ... భం భం అఖండ' అనే ఈ టైటిల్ సాంగ్ ను చిత్రబృందం యూట్యూబ్ లో పంచుకుంది. ఈ హైఓల్టేజ్ సాంగ్ కు తమన్ బాణీలు అందించగా, అనంత శ్రీరామ్ సాహిత్యం అందించాడు. ఈ పాటను మహదేవన్ త్రయం (శంకర్, సిద్ధార్థ్, శివం) ఆలపించింది.

ఈ సినిమా నుంచి ఇటీవలే బాలయ్య లుక్ విడుదల కాగా, అభిమానుల నుంచి విశేష స్పందన లభించింది. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ తదితరులు నటిస్తున్నారు.
Go Back to Shorts
Akhanda
Title Song
Balakrishna
Boyapati Sreenu
Thaman
Ananta Sriram
Tollywood

More Telugu News