Nani: రేపే 'శ్యామ్ సింగ రాయ్' నుంచి లిరికల్ సాంగ్!

Shyam Singh Roy first single will release on 6th November
షార్ట్స్‌లో చూడండి
మొదటి నుంచి కూడా కొత్తదనానికి ప్రాధాన్యతనిస్తూ వస్తున్న నాని, ఇప్పుడు మరింత డిఫరెంట్ కాన్సెప్టుతో కూడిన 'శ్యామ్ సింగ రాయ్' చేశాడు. వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ సినిమాకి, రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించాడు. ఇది చారిత్రక నేపథ్యంతో ముడిపడి కలకత్తా నగరంలో నడిచే కథ.

ఈ సినిమాలో నాని కొత్త హెయిర్ స్టయిల్ తో .. మీసకట్టుతో డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నాడు. ఆయన సరసన నాయికలుగా సాయిపల్లవి .. కృతిశెట్టి .. మడోన్నా సందడి చేయనున్నారు. మొదటి ఇద్దరు కథానాయికలకు ఏ రేంజ్ లో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. మిక్కీ జె మేయర్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుందని అంటున్నారు.

ఈ సినిమా నుంచి రేపు ఉదయం 11 గంటలకు ఫస్టు లిరికల్ సాంగును విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని మరో ఇంట్రెస్టింగ్ పోస్టర్ ద్వారా గుర్తుచేశారు. డిసెంబర్ 24వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా పెద్ద హిట్ ఇస్తుందనే బలమైన నమ్మకంతో నాని ఉన్నాడు..
Go Back to Shorts
Nani
Saipallavi
Krithi Shetty
Madonna

More Telugu News