అఖిల్ 'ఏజెంట్'లో మరో అందాలభామ!
- అఖిల్ కి 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'తో హిట్
- తదుపరి చిత్రంగా సురేందర్ రెడ్డితో 'ఏజెంట్'
- తాజాగా బుడాపెస్ట్ లో జరిగిన షెడ్యూలు
- మరో హీరోయిన్ గా అతుల్య రవి ఎంపిక
ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పేరు 'ఏజెంట్'. స్పై థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. కీలకమైన ఓ ప్రత్యేక పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూలు షూటింగ్ ఇటీవలే బుడాపెస్ట్ లో నిర్వహించారు. తదుపరి షెడ్యూలు షూటింగును త్వరలో హైదరాబాదులో ప్రారంభిస్తారు.
ఇదిలావుంచితే, ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ ఒకటి వచ్చింది. ఈ చిత్రానికి మరింత గ్లామర్ ను యాడ్ చేస్తూ, సెకండ్ హీరోయిన్ పాత్రకు తమిళ కథానాయిక అతుల్య రవిని తీసుకున్నట్టు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వస్తుంది. భారీ బడ్జెట్టుతో నిర్మిస్తున్న ఈ చిత్రంలో అఖిల్ సిక్స్ ప్యాక్ మేకోవర్ లో కనిపించనున్నాడు.