Balakrishna: దీపావళి స్పెషల్ .. 'అఖండ' నుంచి ఇంట్రెస్టింగ్ టీజర్!

  • నిర్మాణానంతర పనుల్లో 'అఖండ'
  • అఘోర పాత్రపై వదిలిన సాంగ్ టీజర్
  • పూర్తి సాంగ్ ఈ నెల 8వ తేదీన
  • డిసెంబర్ 2న సినిమాను రిలీజ్ చేసే ఛాన్స్
Akhanda title song released

బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి మూడో సినిమా చేస్తున్నాడు. 'అఖండ' టైటిల్ తో రూపొందిన ఈ సినిమా, ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాను, డిసెంబర్ 2వ తేదీన విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది.

ముందుగా చెప్పినట్టుగానే దీపావళి కానుకగా ఈ సినిమా నుంచి టైటిల్ సాంగ్ టీజర్ ను వదిలారు. తమన్ స్వరపరిచిన ఈ పాట 'భం అఖండ .. భం అఖండ' అంటూ సాగుతోంది. బాలకృష్ణ పోషించిన అఘోర పాత్రపై ఈ పాటను చిత్రీకరించారు. పూర్తి పాటను ఈ నెల 8వ తేదీన వదలనున్నారు.

బాలకృష్ణ సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ అలరించనుండగా, ప్రతినాయకుడిగా శ్రీకాంత్ కనిపించనున్నాడు. విభిన్నమైన పాత్రను జగపతిబాబు పోషించాడు. ఆయన పాత్ర కూడా ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఈ సినిమాతో బాలకృష్ణ - బోయపాటి హ్యాట్రిక్ హిట్ కొడతారేమో చూడాలి.

More Telugu News