Allu Arjun: వేయిమంది డాన్సర్లతో 'పుష్ప'రాజ్ మాస్ సాంగ్!

  • పాట చిత్రీకరణలో 'పుష్ప'
  • గ్రామీణ నేపథ్యంలో నడిచే పాట
  • లొకేషన్ నుంచి షేర్ చేసిన ఫొటో
  • డిసెంబర్ 17వ తేదీన విడుదల
Pushpa movie shooting update

ఈ ఏడాది చివరిలో వస్తున్నప్పటికీ .. 'పుష్ప' సినిమా బ్లాక్ బస్టర్ హిట్ లక్షణాలను పుణికిపుచ్చుకుని మరీ వస్తున్నట్టుంది. కథాకథనాలతో పాటు పాటల పరంగా కూడా ఈ సినిమా మరింత ఊపును .. ఉత్సాహాన్ని ఇవ్వనున్నట్టుగా అర్థమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమా విజయంలో ప్రధానమైన పాత్రను పోషించనున్నట్టుగా స్పష్టమవుతోంది.

ఇంతవరకూ ఈ సినిమా నుంచి 'దాక్కో దాక్కో మేక' .. ' శ్రీవల్లీ' .. 'సామీ .. సామీ' పాటలు పలకరించాయి. ఈ మూడు పాటలు కూడా మాస్ బాణీలో సాగినవే. రికార్డుస్థాయిలో ఇవి వ్యూస్ ను .. లైక్స్ ను సంపాదించుకున్నాయి. ఇక ఇప్పుడు మరో మాస్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోందనేది అధికారికంగా బయటికి వచ్చింది.

ఈ సినిమా కోసం అల్లు అర్జున్ కాంబినేషన్లో 1000 మంది డాన్సర్లతో ఒక సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. అందుకు సంబంధించిన లొకేషన్ నుంచి ఒక ఫొటోను దీపావళి గిఫ్ట్ గా ఈ సినిమా టీమ్ షేర్ చేసింది. అల్లు అర్జున్ బుల్లెట్ పై కూర్చుని కనిపిస్తున్నాడు  గ్రామీణ నేపథ్యంలో ఈ పాట చిత్రీకరణ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు..

More Telugu News