Ashish: దిల్ రాజు బ్యానర్లో ఛాన్స్ కొట్టేసిన కన్నడ బ్యూటీ!

Sreeleela in Dil Raju movie
షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరకి ఇటీవల కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో శ్రీలీల ఒకరు. రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణ చేసిన 'పెళ్లి సందD' సినిమా ద్వారా ఈ సుందరి పరిచయమైంది. ఈ సినిమా ఫలితం మాట అలా ఉంచితే, గ్లామర్ పరంగా .. నటన పరంగా ఈ కన్నడ బ్యూటీ యూత్ హృదయాలను పొలోమంటూ కొల్లగొట్టేసింది.
 
దాంతో ఇప్పుడు ఈ అమ్మాయిని వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయని అంటున్నారు. ఆల్రెడీ ఆమె రవితేజ 'ధమాకా' సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం .. ఆ సినిమా ఫస్టు షెడ్యూల్ షూటింగును పూర్తిచేసుకోవడం కూడా జరిగిపోయింది. ఇక ఆ తరువాత వైష్ణవ్ తేజ్ జోడిగాను .. ఎన్టీఆర్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా శ్రీలీల ఛాన్స్ కొట్టేసిందనే వార్తలు వినిపించాయి.

తాజాగా దిల్ రాజు బ్యానర్లో చేసే అవకాశాన్ని దక్కించుకుందని అంటున్నారు. దిల్ రాజు తన సోదరుడి తనయుడైన ఆశిష్ హీరోగా 'రౌడీ బాయ్స్' సినిమాను నిర్మించాడు. ఈ నెల 19వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆశిష్ రెండవ సినిమాను కూడా దిల్ రాజునే నిర్మిస్తున్నాడట. ఆ సినిమా కోసం శ్రీలీలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది.
Go Back to Shorts
Ashish
Sreeleela
Dil Raju

More Telugu News