Jr NTR: ఎన్టీఆర్ జోడీగా 'పెళ్లి సందD' హీరోయిన్?

  • 'పెళ్లి సందD'తో పరిచయం
  • రవితేజ జోడీగా 'ధమాకా'
  • దర్శకుడిగా నక్కిన త్రినాథరావు
  • కొరటాల సినిమాలోను ఛాన్స్  
Koratala movie update

తెలుగు తెరకు ఈ మధ్య కాలంలో పరిచయమైన అందమైన కథానాయికలలో శ్రీలీల ఒకరు. 'పెళ్లి సందD' సినిమాతో శ్రీలీల యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ సినిమా టాక్ సంగతి .. వసూళ్ల సంగతి అటుంచితే, శ్రీలీల చక్కదనం గురించి మాత్రం చెప్పుకున్నారు. కృతి శెట్టి తరువాత గ్లామర్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ ముద్దుగుమ్మనే.

రాఘవేంద్రరావు ఎంపిక చేశాడంటే ఆ హీరోయిన్ గురించి ఆలోచించవలసిన అవసరం లేదన్నట్టుగా, ఇప్పుడు ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఆల్రెడీ రవితేజ సరసన నాయికగా 'ధమాకా' సినిమా చేస్తోంది. నక్కిన త్రినాథరావు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. యాక్షన్ కామెడీ జోనర్లో ఈ సినిమా నిర్మితమవుతోంది.

ఇక తాజాగా ఈ కన్నడ బ్యూటీ పేరు ఎన్టీఆర్ జోడీగా కూడా వినిస్తోంది. కొరటాల దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఒక కథానాయికగా అలియా భట్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు శ్రీలీల పేరు తెరపైకి వచ్చింది. ఈ సుందరిని సెకండ్ హీరోయిన్ గా తీసుకున్నారని అనుకోవచ్చునేమో!

More Telugu News