బుద్ధ ప్రసాద్ కుమారుడి పెళ్లి వేడుకలో చిరంజీవి, పవన్ కల్యాణ్... వీడియో ఇదిగో!

24-10-2021 Sun 22:29
  • హైదరాబాదులో మండలి బుద్ధప్రసాద్ కుమారుడి పెళ్లి
  • హాజరైన చిరంజీవి, పవన్ కల్యాణ్
  • వధూవరులకు ఆశీస్సులు
  • మెగా బ్రదర్స్ రాకతో పెళ్లింట మరింత కోలాహలం
Chiranjeevi and Pawan Kalyan attends Mandali Buddha Prasad son wedding
మాజీ మంత్రి మండలి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకట్రామ్ వివాహ రిసెప్షన్ వేడుక హైదరాబాదులో జరిగింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. కొణిదెల సోదరుల రాకతో పెళ్లి వేదిక వద్ద కోలాహలం మిన్నంటింది. చిరంజీవి, పవన్ కల్యాణ్ వధూవరులకు ఆశీర్వాదాలు అందజేశారు. అనంతరం మండలి బుద్ధ ప్రసాద్ కుటుంబసభ్యులతో కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. సామాజిక మాధ్యమాల్లో దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సందడి చేస్తున్నాయి.