'ధమాకా' మొదలెట్టేసిన రవితేజ!

Dhamaka movie update
  • రిలీజ్ కి రెడీగా ఉన్న 'ఖిలాడి'
  • షూటింగు దశలో 'రామారావు ఆన్ డ్యూటీ'
  • సెట్స్ పైకి వెళ్లిన 'ధమాకా'
  • కథానాయికగా శ్రీలీల
రవితేజ తాజా చిత్రంగా థియేటర్లకు రావడానికి 'ఖిలాడి' సినిమా రెడీ అవుతోంది. ఈ సినిమా విడుదల తేదీని సెట్ చేసుకుంటూ ఉండగానే రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాతో సెట్స్ పైకి వెళ్లిపోయాడు. ఆ సినిమా షూటింగు జోరుగా కొనసాగుతూ ఉండగానే, నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమాను సెట్ చేసుకున్నాడు.

ఈ సినిమాకి 'ధమాకా' అనే టైటిల్ ను ఖరారు చేసి, దసరా పండుగ సందర్భంగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక రేపో మాపో రెగ్యులర్ షూటింగు మొదలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆల్రెడీ ఒక షెడ్యూల్ షూటింగును కూడా పూర్తి చేసి రవితేజ షాక్ ఇచ్చాడు. రవితేజ స్పీడ్ ఏ రేంజ్ లో ఉందో తెలుసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ.

ఇక ఈ సినిమాలో 'పెళ్లి సందD' హీరోయిన్ శ్రీలీల నటించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే టీనేజ్ కుర్రాడితో జోడీ కట్టిన ఆమె, ఆ వెంటనే ఇంత సీనియర్ స్టార్ సరసన చేస్తుందా? అనుకున్నారు. కానీ ఆల్రెడీ పూర్తయిన షెడ్యూల్ షూటింగులో శ్రీలీల కూడా పాల్గొన్న విషయం స్పష్టమైంది. త్వరలో మిగతా వివరాలు తెలియనున్నాయి.
Go Back to Shorts
Raviteja
Sreeleela
Trinatha Rao

More Telugu News