Rajanikanth: రికార్డు స్థాయి రిలీజ్ సన్నాహాల్లో 'అన్నాత్తే'

  • సన్ పిక్చర్స్ నుంచి 'అన్నాత్తే'
  • రజనీ సరసన ముగ్గురు హీరోయిన్లు 
  • ప్రత్యేకమైన పాత్రలో కీర్తి సురేశ్ 
  • నవంబర్ 4వ తేదీన విడుదల 
  • తెలుగు టైటిల్ గా 'పెద్దన్న'  
Annatthe movie update

రజనీకాంత్ తాజా చిత్రంగా 'అన్నాత్తే' ప్రేక్షకులను పలకరించనుంది. సన్ పిక్చర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి, శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమా 'పెద్దన్న' పేరుతో రానుంది.

ఇమాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాను, ఓవర్సీస్ లో భారీస్థాయిలో విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు. సెకండ్ వేవ్ తరువాత ఏ ఇండియన్ సినిమా విడుదల కానన్ని ఎక్కువ లొకేషన్లలో 'అన్నాత్తే' విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. రజనీ కెరియర్లో అక్కడ అతిపెద్ద రిలీజ్ అయ్యేలా చూస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఈ సినిమాలో నయనతార .. ఖుష్బూ .. మీనా .. కీర్తి సురేశ్ నటించారు. కీలకమైన పాత్రల్లో జాకీ ష్రాఫ్ .. జగపతిబాబు .. ప్రకాశ్ రాజ్ కనిపించనున్నారు. ఇక ఇటు తెలుగు రాష్ట్రాల్లోను ఈ సినిమాను పెద్ద ఎత్తునే రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. దీపావళికి ఇక్కడి సినిమాలకి 'అన్నాత్తే' ఏ స్థాయిలో పోటీ ఇస్తుందో చూడాలి.

More Telugu News