Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ మనసు దోచింది ఇతనే!

Here it is Rakul Preet Singh boyfriend Jacky Bhagnani
  • పెళ్లిపీటలు ఎక్కనున్న రకుల్!
  • నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో ప్రేమ
  • నేడు రకుల్ పుట్టినరోజు
  • భాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసిన అందాలభామ
టాలీవుడ్ అందాలభామ రకుల్ ప్రీత్ సింగ్ త్వరలో పెళ్ళి పీటలు ఎక్కే అవకాశాలున్నాయి. నటుడు, నిర్మాత జాకీ భగ్నానీతో తన అనుబంధాన్ని రకుల్ వెల్లడించింది. ఇవాళ తన పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ తన బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసింది.

దీనిపై రకుల్ ప్రీత్ స్పందిస్తూ.... ఈ ఏడాది తనకు అతి పెద్ద కానుక భగ్నానీ అని సంతోషంగా వెల్లడించింది. భగ్నానీతో తన జీవితం రంగులమయం అవుతుందని భావిస్తున్నట్టు తెలిపింది. భగ్నానీ స్పందిస్తూ... నువ్వు లేకుండా నా జీవితంలో నో ఫన్ అంటూ రకుల్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించాడు. ఇప్పుడు తనే నా ఆత్మ, నా ప్రపంచం... ఈ సందర్భంగా ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పేర్కొన్నాడు.
Rakul Preet Singh
Jacky Bhagnani
Boy Friend
Tollywood
Bollywood

More Telugu News