సమంత పిల్లల్ని కనాలని అనుకుంది... కానీ...!: నీలిమ గుణ

Neelima Guna responds to Samantha divorce matter
  • నాగచైతన్యతో వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సమంత
  • తాము దిగ్భ్రాంతికి గురయ్యామన్న నీలిమ
  • సమంత తల్లి కావాలనుకుందని వెల్లడి
  • శాకుంతలం తర్వాత విశ్రాంతి కోరుకుందని వివరణ
ఇటీవల నాగచైతన్యతో విడిపోతున్నట్టు ప్రకటించిన నటి సమంత గురించి దర్శకుడు గుణశేఖర్ కుమార్తె నీలిమ గుణ ఆసక్తికర అంశాలు వెల్లడించింది. సమంత ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం చిత్రంలో నటిస్తుండగా, నీలిమ గుణ నిర్మాతగా వ్యవహరిస్తోంది.

ఈ నేపథ్యంలో నీలిమ గుణ స్పందిస్తూ... పిల్లల్ని కనేందుకు వీలుగా శాకుంతలం సినిమాను చేయకూడదని సమంత భావించిందని తెలిపింది. అయితే శాకుంతలం కథ విన్న తర్వాత కొన్ని షరతులతో సినిమా చేసేందుకు ఓకే చెప్పిందని వెల్లడించింది.

"జులై, ఆగస్టు నాటికి సినిమా పూర్తి చేయాలని మా నాన్న (గుణశేఖర్)ను కోరింది. శాకుంతలం సినిమా తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుని పిల్లల్ని కనాలన్నది సమంత ఆలోచన. తల్లి కావాలన్న బలమైన కోరిక సామ్ లో కనిపించింది. ఆమె ఆలోచనలను మేం గౌరవించి, అందుకు అనుగుణంగానే శాకుంతలం చిత్రం షెడ్యూల్ రూపొందించాం. కానీ అంతలోనే ఏదో జరిగింది... నాగచైతన్య, సమంత విడిపోయారు. ఈ పరిణామం మేం ఊహించలేదు" అని వివరించింది.
Go Back to Shorts
Neelima Guna
Samantha
Divorce
Naga Chaitanya
Tollywood

More Telugu News