షారుఖ్ తనయుడితో సెల్ఫీ దిగింది ఎన్సీబీ ఆఫీసర్ కాదు: అధికారుల ప్రకటన
- ముంబై తీరంలో క్రూయిజ్ షిప్‌పై నార్కొటిక్స్ బ్యూరో రెయిడ్
- షారుఖ్ తనయుడు ఆర్యన్ సహా 8 మందికి వైద్య పరీక్షలు
- ఎన్సీబీ విచారణలో ఉన్న ఆర్యన్‌తో సెల్ఫీ తీసుకున్న వ్యక్తి
ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో ఆ వ్యక్తి కూడా ఎన్సీబీ అధికారే అని అందరూ అనుకున్నారు. అయితే అతనికి ఎన్సీబీకి ఎటువంటి సంబంధం లేదని అధికారులు స్పష్టం చేశారు. ‘‘అతను ఎన్సీబీ అధికారి కాదు. అలాగే ఆఫీసులో పనిచేసే వ్యక్తి కూడా కాదు’’ అని ఎన్సీబీ ఒక ప్రకటనలో తెలిపింది.