Raviteja: రవితేజ జోడీగా కన్నడ బ్యూటీ!

  • 'పెళ్లిసందD'తో పరిచయం కానున్న శ్రీలీల
  • దసరాకి ప్రేక్షకుల ముందుకు సినిమా
  • త్రినాథరావు సినిమా కోసం ఎంపిక
  • త్వరలో రానున్న స్పష్టత    
Sreeleela in Raviteja movie

తెలుగు తెరకి మరో కొత్త హీరోయిన్ పరిచయం కాబోతోంది .. ఆ కన్నడ బ్యూటీ పేరే శ్రీలీల. 'పెళ్లి సందD' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. లేడీ డైరెక్టర్ గౌరీ రోణంకి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రోషన్ జోడీగా శ్రీలీల నటించింది. ఎంతోమంది కొత్త కథానాయికలను పరిచయం చేసిన రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో ఈ సుందరి పరిచయమవుతుండటం విశేషం.

ఈ సినిమా టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ బయటికి వస్తుండటంతో, ఈ అమ్మాయికి ఆఫర్లు బాగానే వస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఆమె రవితేజ సినిమాలో కథానాయికగా ఎంపిక అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. 'ఖిలాడి' సినిమాను విడుదలకు రెడీ చేస్తున్న రవితేజ, ఆ తరువాత సినిమాగా 'రామారావు ఆన్ డ్యూటీ' చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత ఆయన నక్కిన త్రినాథరావు దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఆ సినిమా కోసమే శ్రీలీలను తీసుకున్నారని అంటున్నారు. కానీ ఈ అమ్మాయి చిన్న పిల్లలా కనిపిస్తోంది. రవితేజ 'నేల టిక్కెట్టు' సినిమాలో హీరోయిన్ గా మాళవిక శర్మ చేసినప్పుడు, చిన్నపిల్లలా కనిపించిందనే విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News